తెలంగాణ

ఊకె శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి.

బయ్యారం,తెలంగాణ కానుక,సెప్టెంబర్ 1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఉకే శిరీష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో యువతీపై జరిగిన అత్యాచారం,హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూక్యా రవి నాయక్ తెలిపారు.ఈ ఘటనకు బాధ్యులైన నిందితుడు షాన్ ఉల్లా ఖాన్ ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సేవాలాల్ సేన పోరాటం ఆగదన్నారు.ఈ కార్యక్రమంలో అజ్మీర శ్రీకాంత్ నాయక్, జాటోత్ రవి నాయక్,అజ్మీర కళ్యాణ్ నాయక్,భూక్య మోహన్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇండస్ వ్యాలీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక,అధ్యక్షుడుగా చంద్రశేఖర్ ఉప్పలేటి,

ఇండస్ వ్యాలీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షులుగా చంద్రశేఖర్ ఉప్పులేటి, ఉపాధ్యక్షులుగా ఎం.డి. వాజిద్, బలరామ కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా విజయ్ ఆనంద్, కోశాధికారిగా ప్రభాకర్, సంయుక్త కార్యదర్శిగా వై. నాగేందర్, సాంస్కృతిక కార్యదర్శిగా మణిదర్ స్వర్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం. ఆదిత్య, రవి కంబాల ఎన్నికయ్యారు. కాలనీ వాసుల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక–సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని ఐక్యతతో ముందుకు సాగుతామని నూతన కార్యవర్గం తెలిపింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

పద్మశ్రీ హిల్స్ లో ఘనంగా శ్రీ పోచమ్మ తల్లి 5వ వార్షికోత్సవ వేడుకలు

బండ్లగూడ తెలంగాణ కానుక బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ కాలనీలో కొలువైన శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఐదవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ 121 డివిజన్ పరిధిలోని పద్మశ్రీ కాలనీలో పోచమ్మ తల్లి అమ్మవారి 5 వ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ తో కలిసి మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ

సర్ నోటీసులు వచ్చాయని భయపడకండి – ఓటు ఎవరిదీ పోదు : మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ భరోసా

నార్సింగి తెలంగాణ కానుక ఎన్నికల సంఘం నుండి సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) నోటీసులు అందుకుని తమ ఓట్లు తొలగిస్తారేమోనని భయాందోళన చెందుతున్న ప్రజలకు గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అండగా నిలిచారు. మంగళవారం గండిపేట మండల రెవెన్యూ కార్యాలయంలో సర్ కార్యక్రమములో భాగంగా నార్సింగి సర్కిల్ పరిధిలోని ఖానాపూర్ వట్టినాగులపల్లి పరిధిలో నోటీసులు అందుకున్న కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.సర్ నోటీసులు అంటే ఓటు తీసేయడం కాదు. ఓటరు జాబితా సవరణలో భాగంగా అందరి వివరాలు సరిచూసుకోవడానికి ఇచ్చే నోటీసులు మాత్రమే. నోటీసు వచ్చిందని భయపడొద్దని తమ వివరాలు తెలిపే అవసరమైన డాక్యుమెంట్లను ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తో మండల రెవెన్యూ అధికారులు బి ఎల్ ఓ లను కలిసి సమర్పించాలన్నారు.మీ ఓటు ఎవరిదీ పోదు. పూర్తి

కేసీ గుప్త సేవా స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కొండ్లె మల్లికార్జున్‌

కాచిగూడ, సెప్టెంబర్ 01:సమాజ శ్రేయస్సుకు ఆర్యవైశ్య సంఘం విశేష సేవలందిస్తోందని, స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కేసీ గుప్త చూపిన సేవా మార్గంలో పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని కాచిగూడ వైశ్య హాస్టల్ ట్రస్ట్‌ బోర్డు ప్రధాన కార్యదర్శి కొండ్లె మల్లికార్జున్ పిలుపునిచ్చారు.కేసీ గుప్త 107వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక జైన్‌ భవన్‌లో ఇసామియాబజార్‌ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లికార్జున్.. కేసీ గుప్త చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు పంపిణీ చేయడంతో పాటు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, అవసరమైన పరికరాలు, ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొమిరిశెట్టి అనిల్ కుమార్, లక్ష్మణ్, వెంకట గోపాలకృష్ణ, వెంకటేష్, రామకృష్ణ, రఘువీర్, మహేష్, నిఖిలేశ్వర్, శ్రీధర్, రవికుమార్, గుండా విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

రాజకీయాలు

వీడియోలు