టీచర్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 27న తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన అభివృద్ధికి తమ సంస్థ చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. మంచు లక్ష్మి చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంత్రి సీతక్క అభినందించారు.
సీతక్క ను కలసిన సినీనటిమంచు లక్ష్మి.
