తెలంగాణ

మాట ఇచ్చాం బస్సు తెచ్చాం

తోకల శ్రీనివాసరెడ్డి.. సర్పంచ్ ఎన్నికల్లో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చామని నేడు నెరవేర్చమని తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తోకల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం తో ఎన్నికల్లో ఓడిన గెలిచిన గ్రామానికి బస్సు సర్వీసు ‌తెప్పిస్తానని హామీ ఇచ్చిన తోకల శ్రీనివాసరెడ్డి అన్నమాట ప్రకారం‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు ‌చర్చించి ఆయన ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో శుక్రవారం సర్పంచ్ అభ్యర్థి‌ స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి బస్సు సర్వీస్ ప్రారంభించారు. ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు ‌ విద్యార్థులు యువకులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారం కూడా ఎంతగానో ఉందని వారికీ అందరి తరుపున

రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ నూతన చైర్మన్ గా కవంపల్లి సత్యనారాయణ

హైదరాబాద్ ఫిబ్రవరి 27 తెలంగాణ కానుక. గాంధీ భవన్ లో జరిగిన రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా నూతన నియమితులైన మానకొండూరు శాసన సభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.అలాగే మార్చి 10 తేదీన చలో ఎల్బీ స్టేడియం వేదికగా* సత్యనారాయణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం ఎలా చేద్దం అనేదానిపైన విస్తృతంగా విశ్లేషణ జరిపి. అందరు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ క్యారగారి శ్రీధర్ మరియు వైస్ చైర్మన్ వత్తుల నారాయణ ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం నుండి మహేశ్వరం మండలం ఆర్గనైజర్ సెక్రెటరీ బొల్లెపాక జంగయ్య, ఎమ్, ఎమ్.సీ వైస్ చైర్మన్ మైత్రి ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల్లో త్వరలో ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మంత్రి సీతక్క.

తెలంగాణను పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మధుర్‌నగర్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో జిల్లా DWOs లతో సమీక్ష నిర్వ‌హించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల కోసం మొబైల్ అంగన్‌వాడీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మంజూరైన 2,199 భవనాల్లో ఇప్పటికే 500 పూర్తి కాగా మిగిలిన వాటిని త్వ‌ర‌గా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యం, విద్య, రక్షణ విషయాల్లో రాజీ పడకుండా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమ్మ మాట - అంగన్‌వాడీ బాట: ఈ నినాదంతో చేపట్టిన కార్యక్రమాల వల్ల కేంద్రాల్లో చిన్నారుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ కలసినరాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ మందా మకరందు.

రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మందా మకరందు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను హెడ్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మందా మకరందు కు కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్ర నగర్ జోన్ లో ప్రగతిలో అభివృద్ధి కార్యక్రమాలు, సానిటేషన్, తదితర అంశాలను చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు, సానిటేషన్ కార్యకలాపాలు క్షేత్ర స్థాయిలో మరింత ప్రభావవంతంగా చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్ కు కమిషనర్ దిశా నిర్దేశం చేశారు.

ఘనంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

శుభాకాంక్షలు తెలిపిన నీరుడు శేఖర్ ముదిరాజ్ బండ్లగూడ ఫిబ్రవరి 26 తెలంగాణ కానుక చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషుల సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిస్మత్‌పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు నిరుడు శేఖర్ ముదిరాజ్ కొండా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని ప్రశంసించారు.ఆయన ఆయురారోగ్యాలతో, మరింత ప్రజాదరణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు మహేష్ , మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నాయక్ , నిరుడు పవన్ సాయి, నరేష్, సాయి, లక్ష్మణ్,