ఢిల్లీలో కూటమి ఎంపీల ఆత్మీయ.

ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఇచ్చిన విందుకు కూటమి ఎంపీలు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. రామ్మోహన నాయుడు మాతృమూర్తి లోకేష్‌ను ఆశీర్వదించారు. రామన్న పిల్లలను ఎత్తుకున్న లోకేష్ వారితో సరదాగా మాట్లాడించారు. పెద్దమ్మ పురందరేశ్వరి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంపీలందరినీ పేరుపేరునా పలకరిస్తూ సందడి చేశారు.

Read More

రాయచూర్ బంద్ నేపథ్యంలో వాహనాలను యాద్గిర్ వైపు మళ్లింపు – మక్తల్ సీఐ రామ్ లాల్.

జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీస్ ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్ నేపథ్యంలో తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల ద్వారా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాయచూర్ వైపు వెళ్లే వాహనాలను కృష్ణ మండలం టై రోడ్ జంక్షన్ వద్ద నిలిపి యాద్గిర్ వైపు మళ్లిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బంద్ కారణంగా రాయచూర్ వైపు ప్రయాణించే…

Read More

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకున్న విజయ్, రష్మిక.

Read More

కర్ణాటక డిప్యూటీ సీఎంకు ఆహ్వానం..

కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, వచ్చే నెల 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..

Read More

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన టెక్ కంపెనీల సీఈఓలు.

ఆడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకైర్ తో సీఎం సమావేశం లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి వరుస భేటీలు

Read More

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ.

• స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు. • వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. • స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0″ కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పిన సీఎం చంద్రబాబు. • స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా…

Read More

కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ ‌డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

• వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడంతో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి• కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమతో లాభాలు సాధ్యమయ్యాయని కుమారస్వామికి వివరించిన సీఎం• వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ లాభాలు సాధించడంతో పాటు, పూర్తి స్థాయి సామర్ధ్యం మేర పనిచేస్తోందని చెప్పిన సీఎం• ఆర్ఐఎన్ఎల్ విషయంలో భవిష్యత్‌లోనూ ఇంతే తోడ్పాటు, సహకారాన్ని అందించాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు

Read More

రూ. 2.50 లక్షల మద్యం పట్టివేత..

ఢిల్లీ సమీపంలోని నొయిడా నుంచి మద్యం తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలంగాణకు సరఫరా.. కారుతోపాటు 84 మద్యం బాటిళ్ల స్వాధీనం.. ఢిల్లీ ప్రాంతం నుంచి ఒక కారులో నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్ దిగుమతి అవుతుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి , ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి ఉప్పల్ భాగయాత్ ప్రాంతంలో కాపుకాచి కారును పట్టుకున్నారు. కారులో 84 విలువైన ఢిల్లీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ…

Read More

ఒమన్ రాయబారితో ఏ.పీ. జితేందర్ రెడ్డి భేటీ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ. జితేందర్ రెడ్డి న్యూఢిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో ఇవాళ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం.. తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా సాగింది.తెలంగాణలోని పెట్టుబడి అనుకూలమైన విధానాలను జితేందర్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒమన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రాయబారి…

Read More

ఎస్‌ఐఆర్‌కు ముందు బీఎల్‌ఏల నియామకం చేయాలి:

రానున్న ప్రత్యేక సుదీర్ఘ సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌)ను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)ను నియమించాలని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్‌ రెడ్డి కోరారు. బూత్‌ స్థాయిలో బలమైన సమన్వయం ఈ ప్రక్రియకు కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

Read More