తాండూర్ తెలంగాణ కానుక
ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసి యేషన్ తాండూర్.. ఆధ్వ ర్యంలో లోక కళ్యాణా ర్థం కోసం వర్షాలు సమృద్ధి గా పడి, పాడి పంటలు బాగా పండాలని, రైతులు సుభి క్షంగా ఉండాలని.. మహా శివుడికి జలాభిషేకం, వరుణ యాగం, పూర్ణా హుతి వైభవంగా నిర్వహిం చారు.కార్యక్రమానికి ఎమ్మె ల్యే మనోహర్ రెడ్డి, మున్సి పల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు, నాయకులు హాజరై పూజ లు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడు తూ..చెరువులు నీరు లేక వెల వెల బోతున్నాయని, బోర్లలో నీరు తగ్గడం వల్ల పంటలు ఎండిపోతు న్నాయని అన్నారు.ముఖ్యంగా ఏ ప్రాణికైనా నీళ్లే ఆధారమని, వర్షాలు బాగా కురవాలని పంటలు పండాలని దేవుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ నర్సిములు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
