బయ్యారం,తెలంగాణ కానుక,సెప్టెంబర్ 1.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఉకే శిరీష హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో యువతీపై జరిగిన అత్యాచారం,హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూక్యా రవి నాయక్ తెలిపారు.ఈ ఘటనకు బాధ్యులైన నిందితుడు షాన్ ఉల్లా ఖాన్ ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు సేవాలాల్ సేన పోరాటం ఆగదన్నారు.ఈ కార్యక్రమంలో అజ్మీర శ్రీకాంత్ నాయక్, జాటోత్ రవి నాయక్,అజ్మీర కళ్యాణ్ నాయక్,భూక్య మోహన్ నాయక్, చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
