బండ్లగూడ తెలంగాణ కానుక
బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్ కాలనీలో కొలువైన శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి ఐదవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్ సర్కిల్ బండ్లగూడ 121 డివిజన్ పరిధిలోని పద్మశ్రీ కాలనీలో పోచమ్మ తల్లి అమ్మవారి 5 వ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ తో కలిసి మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, డివిజన్ మరింత అభివృద్ధి చెందాలని మాజీ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
