కేసీ గుప్త సేవా స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కొండ్లె మల్లికార్జున్‌

Spread the love

కాచిగూడ, సెప్టెంబర్ 01:
సమాజ శ్రేయస్సుకు ఆర్యవైశ్య సంఘం విశేష సేవలందిస్తోందని, స్వాతంత్య్ర సమరయోధుడు స్వర్గీయ కేసీ గుప్త చూపిన సేవా మార్గంలో పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని కాచిగూడ వైశ్య హాస్టల్ ట్రస్ట్‌ బోర్డు ప్రధాన కార్యదర్శి కొండ్లె మల్లికార్జున్ పిలుపునిచ్చారు.
కేసీ గుప్త 107వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక జైన్‌ భవన్‌లో ఇసామియాబజార్‌ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ గుప్త అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లికార్జున్.. కేసీ గుప్త చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, దుస్తులు పంపిణీ చేయడంతో పాటు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, అవసరమైన పరికరాలు, ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొమిరిశెట్టి అనిల్ కుమార్, లక్ష్మణ్, వెంకట గోపాలకృష్ణ, వెంకటేష్, రామకృష్ణ, రఘువీర్, మహేష్, నిఖిలేశ్వర్, శ్రీధర్, రవికుమార్, గుండా విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *