సీతక్క ను కలసిన సినీనటిమంచు లక్ష్మి.

టీచర్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 27న తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తాను స్థాపించిన ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన అభివృద్ధికి తమ సంస్థ చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. మంచు లక్ష్మి చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంత్రి సీతక్క అభినందించారు.

Read More

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకున్న విజయ్, రష్మిక.

Read More

తెలుగు సినిమాల్లో గ్లామర్ వార్ ప్రభాస్, చిరుంజీవి, రవితేజ చిత్రాల హీరోయిన్ హైలైట్స్.

తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి అంటే పండుగ సంబరాలతో పాటు థియేటర్ల దగ్గర కనిపించే భారీ సినిమాల సందడి. ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ పూర్తిగా ఫుల్ ప్యాక్డ్ అయిపోయింది. హీరోల మధ్య పోటీ ఎలా ఉంటుందో తెలిసిందే… కానీ ఈసారి ఆ పోటీకి ఏమాత్రం తగ్గకుండా హీరోయిన్ల మధ్య కూడా గ్లామర్ వార్ హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే, ఈ సంక్రాంతి వెండితెరపై ‘అందాల జాతర’ జరగబోతోంది. ప్రభాస్ నుంచి శర్వానంద్ వరకూ స్టార్ హీరోలు…

Read More