లోటస్ స్కూల్ ల్లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు

Spread the love

మణికొండ తెలంగాణ కానుక

మణికొండలోని లోటస్ స్కూల్ విద్యార్థినులు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా మణికొండ మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి ని కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో నెక్నాంపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు ప్రభావతి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రక్షాబంధన్ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే కాకుండా, పరస్పరం ప్రేమ, ఆప్యాయత, రక్షణను పంచుకునే గొప్ప సందేశాన్ని అందిస్తుందని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు రక్షణగా అందరం నిలవాలని పిలుపునిచ్చారు.

“నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనం అందరం ఈ దేశానికి రక్ష” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో లోటస్ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *