సర్ నోటీసులు వచ్చాయని భయపడకండి – ఓటు ఎవరిదీ పోదు : మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ భరోసా

Spread the love

నార్సింగి తెలంగాణ కానుక

ఎన్నికల సంఘం నుండి సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ) నోటీసులు అందుకుని తమ ఓట్లు తొలగిస్తారేమోనని భయాందోళన చెందుతున్న ప్రజలకు గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అండగా నిలిచారు. మంగళవారం గండిపేట మండల రెవెన్యూ కార్యాలయంలో సర్ కార్యక్రమములో భాగంగా

నార్సింగి సర్కిల్ పరిధిలోని ఖానాపూర్ వట్టినాగులపల్లి పరిధిలో నోటీసులు అందుకున్న కుటుంబాలను ఆయన స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.
సర్ నోటీసులు అంటే ఓటు తీసేయడం కాదు. ఓటరు జాబితా సవరణలో భాగంగా అందరి వివరాలు సరిచూసుకోవడానికి ఇచ్చే నోటీసులు మాత్రమే. నోటీసు వచ్చిందని భయపడొద్దని తమ వివరాలు తెలిపే అవసరమైన డాక్యుమెంట్లను ఆధార్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ తో మండల రెవెన్యూ అధికారులు బి ఎల్ ఓ లను కలిసి సమర్పించాలన్నారు.మీ ఓటు ఎవరిదీ పోదు. పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అర్హులైన ఒక్క ఓటు కూడా పోకుండా చూసే బాధ్యత తమదేనని, అన్నారు. ఈ కార్యక్రమంలో తలారి మల్లేష్ ముదిరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *