గ్రీన్ హిల్స్ కాలనీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి,

Spread the love

మహేశ్వరం తెలంగాణ కానుక

మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్ డివిజన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలోనీ శ్రీ సాయిబాబా* ఆలయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ మెంబర్ *దేప భాస్కర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా దేప భాస్కర్ రెడ్డి సాయిబాబా స్వామి వారికి ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ బాబా ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని, కాలనీ సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ చిలుక ఉపేందర్ రెడ్డి రామకృష్ణాపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత, ముప్పిడి లింగస్వామి గౌడ్, తలాటి రమేష్ నేత, రామకృష్ణ గౌడ్,సుదర్శన్, రమేష్ గౌడ్, కాలిని వాసులు కృష్ణారావు, నాగేష్ నేత,రఘువీర్, ఎల్లారెడ్డి, వీరారెడ్డి, పురుషోత్తం, యాదయ్య, నరసింహ, శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *