బండ్లగూడ తెలంగాణ కానుక
కాలనీ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని దన్నాడ లక్ష్మణ్ కోరారు.రాజేంద్రనగర్ సర్కిల్ 123వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 12 లక్ష్యాల నిధులు మంజూరు కావడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు సహకరించిన అధికారులకు మాజీ ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇందిరానగర్ కాలనీలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు. ఇందిరానగర్ కాలనీలో ని అన్ని సమస్యల పరిష్కరించడానికి రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు దన్నాడ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సాయినాథ్, జనరల్ సెక్యూరిటీ నాగరాజు, ప్రచార కార్యదర్శి శివకుమార్, మహిళా ప్రతినిధి శాంతి నాయక్,దేవదయాశక అధ్యక్షుడు పి. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ మల్లేష్, యాదగిరి,సిద్దప్ప కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
