రూ. 2.50 లక్షల మద్యం పట్టివేత..

Spread the love

ఢిల్లీ సమీపంలోని నొయిడా నుంచి మద్యం తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలంగాణకు సరఫరా..

కారుతోపాటు 84 మద్యం బాటిళ్ల స్వాధీనం..

ఢిల్లీ ప్రాంతం నుంచి ఒక కారులో నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్ దిగుమతి అవుతుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి , ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి ఉప్పల్ భాగయాత్ ప్రాంతంలో కాపుకాచి కారును పట్టుకున్నారు.

కారులో 84 విలువైన ఢిల్లీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మద్యం బాటిళ్లు ఎవరికి ఇవ్వడానికి తీసుకవచ్చాయని కారు డ్రైవర్ అదిత్య ప్రసాద్ ప్రశ్నించినపుడు ఉప్పల్ ప్రాంతానికి చెందిన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి తీసుక రమ్మని చెప్పాడని, మద్యం దుకాణంలో డబ్బులు ఆయనే చెల్లించారని ఎస్టీఎఫ్ టీమ్‌కు తెలిపారు.

నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతిష్ట హోం 408లో నివాసం ఉండే గోపాల్‌రెడ్డిని అరెస్టు చేశారు.

గతంలో కూడ పంచాయతీ ఎన్నికల్లో నల్లగొండ ప్రాంతానికి రెండు మార్లు 30 కాటన్ల చొప్పున నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ను సరఫరా చేశానని నిందితులు అంగీకరించారు.

ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశారు ఇద్దరిని అరెస్ట్ చేశారు. డ్రైవర్ ఆదిత్య ప్రసాద్ కొనుగోలు చేసిన వ్యక్తి గోపాల్ రెడ్డి ని అరెస్ట్ చేశారు.

మద్యం బాటిళ్లను, తీసుక వచ్చిన కారును, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మద్యం అమ్మకాలు జరిపిన ఢిల్లీకి చెందిన ప్రసాద్ డిస్ట్రిబ్యూటర్‌పై కేసు నమోదు చేసినట్లు ప్రదీప్‌రావు తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *