జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీస్ ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్ నేపథ్యంలో తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల ద్వారా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాయచూర్ వైపు వెళ్లే వాహనాలను కృష్ణ మండలం టై రోడ్ జంక్షన్ వద్ద నిలిపి యాద్గిర్ వైపు మళ్లిస్తూ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బంద్ కారణంగా రాయచూర్ వైపు ప్రయాణించే వాహనాలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు. రాయచూర్ వైపు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించుకోవాలని అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు అక్కడే బందోబస్తు నిర్వహిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
ఈ బందోబస్తులో ఎస్సై లు ఎస్.ఎం. నవీద్, భాగ్యలక్ష్మి రెడ్డి, రేవతి, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రాయచూర్ బంద్ నేపథ్యంలో వాహనాలను యాద్గిర్ వైపు మళ్లింపు – మక్తల్ సీఐ రామ్ లాల్.
