కూటమి ప్రజాప్రతినిధులతో కొనసాగుతున్న విందు సమావేశాలు.

Spread the love

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు కుటుంబ విలువలకు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. రాజమహేంద్రవరం, నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు ఉండవల్లి నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ విందు సమావేశం ఏర్పాటు చేశారు. కృష్ణా నది ఒడ్డున గోదావరి జిల్లా అతిథులకు మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చారు. ఈ ఆత్మీయ కలయిక వనభోజనాలను తలపించింది. పెద్దల మాటలు, పిల్లల ఆటలు, మహిళల పలకరింపులతో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రజాప్రతినిధులంతా హాజరై కూటమి అంటే మూడు పార్టీలు కాదు, ఒక్కటే అని చాటిచెప్పారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రత్నం పెన్ ను లోకేష్ కు అందించారు. లోకేష్ దంపతుల చిత్రాన్ని వస్త్రంపై ఎంతో ఓపిగ్గా ఎంబ్రాయిడరీ చేసి కానుకగా ఇచ్చారు మరో ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. విందు అనంతరం మహిళలకు మంగళగిరి పట్టుచీరలు కానుకగా అందజేశారు.
ఈ ఆత్మీయ విందుకు రాజమండ్రి పార్లమెంటు నుంచి ఎమ్మెల్యేలు మంత్రి కందుల దుర్గేష్ (నిడదవోలు-జనసేన), ఆదిరెడ్డి శ్రీనివాస్ (రాజమండ్రి సిటీ), గోరంట్ల బుచ్చయ్యచౌదరి (రాజమండ్రి రూరల్), ముప్పిడి వెంకటేశ్వరరావు (కొవ్వూరు), మద్దిపాటి వెంకటరాజు (గోపాలపురం), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (అనపర్తి-బీజేపీ), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం-జనసేన), సోము వీర్రాజు (ఎమ్మెల్సీ-బీజేపీ), నర్సాపురం పార్లమెంటు నుంచి ఎంపీ కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (బీజేపీ), ఎమ్మెల్యేలు మంత్రి నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (ఉండి), బొమ్మిడి నాయకర్ (నర్సాపురం-జనసేన), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లి గూడెం -జనసేన), పితాని సత్యనారాయణ (ఆచంట), పులపర్తి రామాంజనేయులు (భీమవరం -జనసేన), ఆరిమిల్లి రాధాకృష్ణ (తణుకు) కుటుంబసభ్యులతో హాజరయ్యారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *