వార్సా (పోలాండ్) వేదికగా జరిగిన 2025 ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకాలు సాధించిన తెలుగు క్రీడాతేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కోనేరు హంపి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా, ఓపెన్ విభాగంలో తెలంగాణ యువ చెస్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి కాంస్య పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచారు.దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ఈ విజయాలు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. నైపుణ్యం, పట్టుదల, నిరంతర సాధనతో హంపి, అర్జున్‌లు సాధించిన ఈ విజయం అంతర్జాతీయ చెస్ వేదికపై భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో తెలుగు తేజాల ప్రతిభ.
