కల్వకుంట్ల కవిత తో తెలంగాణ ఉద్యమ కళాకారులు భేటీ.

Spread the love

తెలంగాణ ఉద్యమాన్ని నడిపించనవి మాట.. పాట.. ఎందరో పెద్దవాళ్లు తమ మాటలతో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలియజేస్తే.. కళాకారులు ఊరూరా గజ్జె కట్టుకొని ప్రచారం చేస్తేనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది..

ఉద్యమ ఆకాంక్షను నిలబెట్టింది కూడా తెలంగాణ పాటే.. వేలాది మంది కళాకారులు ఊరూరా తిరిగి గజ్జకట్టి ఆడిపాడారు

బీఆర్ఎస్ ప్రభుత్వంలొ 550 మందికి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు.. అదే స్థాయిలో అర్హతలు ఉండి కూడా ఉద్యోగాలు రానివాళ్లు ఇంకా ఉన్నారు.. వాళ్లందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం.,

తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.. కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలి

ఇందిరా పార్క్ వద్ద కాళాకారులు చేపట్టే ఆందోళనలో పాల్గొంటాం


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *