రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవానికి సిఎంకు ఆహ్వానం.

Spread the love

తెలంగాణ సాయుధ పోరాట యోధులు, నల్లగొండ లోక్ మాజీ సభ్యులు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రావాలని తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు సి పి ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఎ కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ ఎంఎల్ చాడ వెంకట రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి, సభ్యులు రావి భారతి, కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు మంగళవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఒక లేఖను అందజేశారు. రావి నారాయణ రెడ్డి రావి నారాయణరెడ్డి స్మారక జాతీయ అవార్డును ఈ ఏడాది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ట్రస్ట్ నిర్ణయించిందని ట్రస్ట్ అధ్యక్షులు చాడ వెంకట రెడ్డి సిఎం రేవంత్ రెడ్డికి వివరించారు. నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో ఒకరైన రావి నారాయణ రెడ్డి పోరాట స్ఫూర్తిని తరతరాలు స్మరించుకునే విధంగా ఆయన విగ్రహాన్ని ఎల్. బి నగర్ ఏర్పాటు చేయాలని, ఎల్.బి నగర్ (కొత్తపేట) నిర్మిస్తున్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ప్రభుత్వ ఆసుపత్రికి రావి నారాయణ రెడ్డి పేరు పెట్టాలని కందిమల్ల ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రదానోత్సవానికి వస్తానని చెప్పినట్లు చాడ వెంకట రెడ్డి తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *