మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీ.

Spread the love

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో రోబోటిక్ టెక్నాలజీతో ప్రతిభ చూపించిన జలమండలి ఇప్పుడు AI ఆధారిత టెక్నాలజీతో డీ సిల్టింగ్ పనులను నిర్వహించడానికి ప్రయోగాత్మకంగా కొత్త టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

శుక్రవారం ఓ అండ్ ఎం డివిజన్-2 పరిధిలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ కలిసి ఈ టెక్నాలజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

శాటిలైట్ ఆధారిత, జీఐఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ టెక్నాలజీతో మ్యాన్ హోల్ వద్ద మానవ రహిత ఆటోమేటిక్ పొజిషనింగ్ తో డీ సిల్టింగ్ పనులు వేగంగా పూర్తి చేయవచ్చని ఎండీ, ఈడి ఈ సందర్భంగా వివరించారు.

ఇప్పటికే ఎలాంటి వ్యయం లేకుండా 90 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రోగ్రాంతో విప్లవాత్మక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన జలమండలి ఈ టెక్నాలజీతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

టెక్నాలజీ ముఖ్య అంశాలు:*
నిలువు మాన్‌హోల్స్‌తో పాటు అడ్డంగా ఉన్న పైప్‌లైన్లను శుభ్రం చేసే సెల్ఫ్ డిటెక్టివ్ తో రోబోటిక్ వ్యవస్థలు
మాన్ హాలో లో అడ్డంకులు ఏర్పడే ముందే అంచనా వేసి నివారించే AI ఆధారిత ప్రిడిక్షన్ & ప్రివెంటివ్ అవకాశం.
శాటిలైట్ మరియు GIS సమన్వయంతో అండర్‌గ్రౌండ్ సీవరేజ్ వ్యవస్థకు లైవ్ డిజిటల్ మ్యాప్ అనుసంధానం.
నగరవ్యాప్తంగా పారిశుధ్య కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, ట్రాక్ చేయడానికి మరియు ప్రణాళిక రూపొందించడానికి సహాయపడే రియల్-టైమ్ డాష్‌బోర్డ్స్ సాంప్రదాయ వ్యవస్థలతో అనుసంధానం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకతలు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భార్గవ, సీజిఎం నాగేందర్, జీఎం శ్యాం సుందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *