ఘనంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.

Spread the love

శుభాకాంక్షలు తెలిపిన నీరుడు శేఖర్ ముదిరాజ్

బండ్లగూడ ఫిబ్రవరి 26 తెలంగాణ కానుక

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీజేపీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషుల సమక్షంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిస్మత్‌పూర్ మాజీ ఉపసర్పంచ్, రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు నిరుడు శేఖర్ ముదిరాజ్ కొండా ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అని ప్రశంసించారు.ఆయన ఆయురారోగ్యాలతో, మరింత ప్రజాదరణతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు మహేష్ , మాజీ కార్పొరేటర్ ప్రశాంత్ నాయక్ , నిరుడు పవన్ సాయి, నరేష్, సాయి, లక్ష్మణ్, సందీప్ యాదవ్, ఉదయ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *