హైదరాబాద్, ఫిబ్రవరి 26: రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ -మధుమతి మున్నూరి దంపతుల కుమార్తె శ్రేయ వివాహం కీ.శే. కంఠం విశ్వేశ్వర రావు వాణిశ్రీ దంపతుల కుమారుడు పృధ్వితో గురువారం హైదరాబాద్ లోని ది అడ్రస్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్స్ లో ఘనంగా జరింది. వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, మున్నూరుకాపు కుల సంఘాల ప్రతినిధులు, కుల ప్రముఖులు, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో అడ్వొకేట్స్ కాసుల వినోద్, కుటుంబ సభ్యులు, కొండూరు వినోద్ కుమార్, బందు మిత్రులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
వేడుకగా రాజస్థాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ లక్ష్మణ్ కుమార్తె వివాహం.
