తెలంగాణను పోషకాహార లోప రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మధుర్‌నగర్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో జిల్లా DWOs లతో సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల కోసం మొబైల్ అంగన్‌వాడీ అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. మంజూరైన 2,199 భవనాల్లో ఇప్పటికే 500 పూర్తి కాగా మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యం, విద్య, రక్షణ విషయాల్లో రాజీ పడకుండా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అమ్మ మాట – అంగన్‌వాడీ బాట: ఈ నినాదంతో చేపట్టిన కార్యక్రమాల వల్ల కేంద్రాల్లో చిన్నారుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీల్లో త్వరలో ‘బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ మంత్రి సీతక్క.
