మాట ఇచ్చాం బస్సు తెచ్చాం

Spread the love

తోకల శ్రీనివాసరెడ్డి..

సర్పంచ్ ఎన్నికల్లో గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చామని నేడు నెరవేర్చమని తోకల శ్రీనివాసరెడ్డి అన్నారు. శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేక గ్రామ ప్రజలు ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తోకల శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం తో ఎన్నికల్లో ఓడిన గెలిచిన గ్రామానికి బస్సు సర్వీసు ‌తెప్పిస్తానని హామీ ఇచ్చిన తోకల శ్రీనివాసరెడ్డి అన్నమాట ప్రకారం‌ ఆర్టీసీ ఉన్నతాధికారులతో పలుమార్లు ‌చర్చించి ఆయన ఆర్టీసీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో శుక్రవారం సర్పంచ్ అభ్యర్థి‌ స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి బస్సు సర్వీస్ ప్రారంభించారు. ఎన్నో రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు ‌ విద్యార్థులు యువకులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహకారం కూడా ఎంతగానో ఉందని వారికీ అందరి తరుపున కృతఙతలు తెలిపారు.
గ్రామాలలో అభివృద్ధి బిజెపి పార్టీతోనే సాధ్యమవుతుందని మరొకసారి రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేష్-రాజు , ఉప సర్పంచ్ విజయ్ కుమార్, వంగ మహేందర్ రెడ్డి మునుగుల రాజిరెడ్డి గారు,వార్డు సభ్యులు మున్నూరు సిద్దులు , మైలారం రాధికా-శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి గారు,సిద్దేశ్వర్ గౌడ్, సంతోష్ కుమార్, వెంకటేష్ గౌడ్,మైలారం దర్శన్, మైలారం కృష్ణ, శ్రీనివాస్ గౌడ్‌ మరో స్థానిక యువకులు బస్తీ వాస్తవ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *