భారత దేశ ప్రదానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటనలో బాగంగా ఆయనని సత్కరించేందుకు శనివారం మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్థానిక భారతీయులతో ఘనమైన స్వాగత సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమలో వివిధ కళాకారుల బృందాలతో ప్రధానమంత్రిని స్వాగతించి సత్కరించారు.
ముఖ్యంగా మైటా ( మలేషియా తెలంగాణ అసోసియేషన్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేదిక పైన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ని ప్రతిబింబించేలా కళాకారుల బతుకమ్మ, బోనాలు మరియు లంబాడి నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మైటా అధ్యక్షులు శ్రీ సైదం తిరుపతి మాట్లాడుతూ తక్కువ సమయంలో కేటాయించిన 7 నిమిషాల నిడివి గల నృత్యప్రదర్శనను విజయవంతంగా కూర్చి ప్రదర్శించిన మైటా మహిళా సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైటా కోర్ కమిటీ సభ్యులతో పాటు మైటా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
