అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్‌తో పాటు… గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతో పాటు….ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం డవల్మెంట్‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారలుతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. నదీతీరం వెంట టూరిజం ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ డిజైన్, స్పిల్ వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్దిలో అనుభవం ఉన్న నిప్పాన్ కోయి సంస్థ ప్రతినిధులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో నదికి ఇరువైపులా పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు ఎగువున భద్రాచలం సమీపం వరకు ఏపీ భూభాగంలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమృద్ధిగా నీటి వనరులు, పచ్చని కొండలు, అటవీ ప్రాంతాలతో మంచి పర్యాటక ప్రాంతంగా పోలవరం మారుతుందని సీఎం అన్నారు. ఎకో టూరిజం, రాక్ క్లైంబింగ్, వెల్‌నెస్ సెంటర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి అనుకూలంగా మార్చాలని సీఎం సూచించారు.
పోలవరానికి పర్యాటక శోభ,.అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు,
