మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన.

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు మధ్య ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుపుకున్న విజయ్, రష్మిక.

Read More

కర్ణాటక డిప్యూటీ సీఎంకు ఆహ్వానం..

కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి, వచ్చే నెల 5న హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..

Read More

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన టెక్ కంపెనీల సీఈఓలు.

ఆడోబ్ సీఈఓ శాంతనూ నారాయణ్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలే, ఆరామ్కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకైర్ తో సీఎం సమావేశం లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ ఆధార్ ఫౌండర్ సీటీఓ శ్రీకాంత్ నాదముని, కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో ముఖ్యమంత్రి వరుస భేటీలు

Read More

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ.

• స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను కేంద్ర మంత్రికి వివరించిన సీఎం చంద్రబాబు. • వేస్ట్ మేనేజ్మెంట్, జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ గా ఏపీని తీర్చిదిద్దేందుకు తీసుకున్న చర్యలను ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి. • స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0″ కింద రూ. 276 కోట్ల ఖర్చుతో జీరో ల్యాండ్ ఫిల్ స్టేట్ కు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పిన సీఎం చంద్రబాబు. • స్వచ్ఛ భారత్ మిషన్-2.0లో భాగంగా…

Read More

కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ ‌డీ కుమారస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ

• వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడంతో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి• కేంద్రం అందించిన ఆర్ధిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, స్టీల్ ప్లాంట్ కార్మికులు-ఉద్యోగుల పట్టుదల, శ్రమతో లాభాలు సాధ్యమయ్యాయని కుమారస్వామికి వివరించిన సీఎం• వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ లాభాలు సాధించడంతో పాటు, పూర్తి స్థాయి సామర్ధ్యం మేర పనిచేస్తోందని చెప్పిన సీఎం• ఆర్ఐఎన్ఎల్ విషయంలో భవిష్యత్‌లోనూ ఇంతే తోడ్పాటు, సహకారాన్ని అందించాలని కేంద్రాన్ని కోరిన సీఎం చంద్రబాబు

Read More

రూ. 2.50 లక్షల మద్యం పట్టివేత..

ఢిల్లీ సమీపంలోని నొయిడా నుంచి మద్యం తక్కువ ధరలకు కొనుగోలు చేసి తెలంగాణకు సరఫరా.. కారుతోపాటు 84 మద్యం బాటిళ్ల స్వాధీనం.. ఢిల్లీ ప్రాంతం నుంచి ఒక కారులో నాన్‌డ్యూటి పెయిడ్ లిక్కర్ దిగుమతి అవుతుందనే సమాచారం మేరకు ఎస్టీఎఫ్ బీ టీమ్ లీడర్ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి , ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి ఉప్పల్ భాగయాత్ ప్రాంతంలో కాపుకాచి కారును పట్టుకున్నారు. కారులో 84 విలువైన ఢిల్లీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ…

Read More

ఒమన్ రాయబారితో ఏ.పీ. జితేందర్ రెడ్డి భేటీ.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ. జితేందర్ రెడ్డి న్యూఢిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో ఇవాళ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం.. తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా సాగింది.తెలంగాణలోని పెట్టుబడి అనుకూలమైన విధానాలను జితేందర్ రెడ్డి వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒమన్ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రాయబారి…

Read More

ఎస్‌ఐఆర్‌కు ముందు బీఎల్‌ఏల నియామకం చేయాలి:

రానున్న ప్రత్యేక సుదీర్ఘ సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ – ఎస్‌ఐఆర్‌)ను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణలోని ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు కనీసం ఒక బూత్‌ లెవల్‌ ఏజెంట్‌ (బీఎల్‌ఏ)ను నియమించాలని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్‌ రెడ్డి కోరారు. బూత్‌ స్థాయిలో బలమైన సమన్వయం ఈ ప్రక్రియకు కీలకమని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,…

Read More

కాలేశ్వరం ప్రాజెక్టు పై కేంద్రం ప్రశంసలు.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకం మీద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే 2026 ప్రశంసలు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల (2014) నుండి 2.2 కోట్ల ఎకరాలకు (2023) పెరిగింది అని ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టులో వెల్లడి. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించిన…

Read More

‘వికసిత్ భారత్ 2047’ సాధన లక్ష్యంగా నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగ మేళాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించే ప్రయత్నాల్లో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిర్దిష్ట కాలపరిమితితో నియామక ప్రక్రియలను చేపడుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టలో గల సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన 18వ విడత ఉద్యోగ మేళాలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాల్లో నియామక ప్రక్రియ క్రమబద్ధీకరణ, వేగవంతం…

Read More

యువతకు భరోసా, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే వేదిక ఉద్యోగ మేళా: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.

హైదరాబాద్‌లోని హకీంపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో (ఎన్ఐఎస్ఏ) శనివారం జరిగిన 18వ ఉద్యోగ మేళాకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కొత్తగా ఎంపికైన వారికి ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ యువత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపారమైన శ్రద్ధ, ప్రేమ ఉన్నాయన్నారు. ఇంతకు ముందు నిర్వహించిన 17 ఉద్యోగ…

Read More

సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో రక్త రుగ్మతలకు చికిత్స

ఖమ్మం,జనవరి,24,తెలంగాణ కానుక ప్రతినిధి:ఖమ్మం ప్రాంతానికి చెందిన ఆరు సంవత్సరాల బాబు ప్రతినెల రక్తస్రావం అవుతూ ప్లేట్లెట్స్ పడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తల్లిదండ్రులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించగా అక్కడున్న వైద్య బృందం వెంటనే బోన్ మ్యారో పరీక్షలు నిర్వహించగా అప్లాస్టిక్ అనిమీయ గా నిర్ధారించడం జరిగిందని దీనికి ఆల్లో జెనిక్ బోన్ మారో ట్రాన్స్ఫాంటేషన్ విజయవంతంగా నిర్వహించాము సంవత్సరం అయిన తర్వాత తన ఆరోగ్యం నిలకడగా ఉందని సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ అశోక్…

Read More

భారతీయ జనతా పార్టీ సంబరాలు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సంబురాలు జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి టపాసులు పేల్చి, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. “జై బీజేపీ” నినాదాలతో పార్టీ కార్యాలయం హోరెత్తింది. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బూర నర్సయ్య గౌడ్ గారు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సంబురాల్లో బిజెపి తెలంగాణ…

Read More

ఖాజాగూడ చెరువు క‌బ్జాల‌పై హైడ్రా దృష్టి.

ఖాజాగూడ చెరువు క‌బ్జాల లెక్క‌లు తేల్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది. ఖాజాగూడ చెరువు తూములు, అలుగులు మూసేయ‌డం.. డైవ‌ర్ట్ చేయ‌డంపై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌తో పాటు.. ప్ర‌జ‌ల నుంచి ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ఖాజాగూడ చెరువు అలుగుతో పాటు తూములు మూసేయ‌డం డైవ‌ర్ట్ చేసిన‌ట్టు గుర్తించారు. ఖాజాగూడ చెరువు కింద భాగంలో దీనికి అనుసంధానంగా ఉన్న చిన్న చెరువు రూపురేఖ‌లు మార్చిన‌ట్టు గుర్తించారు. చెరువు ఆన‌వాళ్లు…

Read More

మహిళా ‘ఐఏఎస్’లపై అసత్య ప్రసారాలు.

తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఐఏఎస్ అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ప్రసారం చేసిన కథనాలపై ఐఏఎస్ అధికారుల సంఘం యుద్ధం ప్రకటించింది. సంఘం అధ్యక్షుడు కె. రామకృష్ణారావు, కార్యదర్శి జయేష్ రంజన్ శనివారం ఈ మేరకు ఘాటైన ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిరాధారమైన ఆరోపణలతో అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని…

Read More

ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో తెలుగు తేజాల ప్రతిభ.

వార్సా (పోలాండ్) వేదికగా జరిగిన 2025 ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి పతకాలు సాధించిన తెలుగు క్రీడాతేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ ఛాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో కోనేరు హంపి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోగా, ఓపెన్ విభాగంలో తెలంగాణ యువ చెస్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి కాంస్య పతకం సాధించి దేశ గౌరవాన్ని పెంచారు.దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు ఈ…

Read More

వికసితభారత్ లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి— కిషన్ రెడ్డి.

వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన త్యాగస్ఫూర్తి, దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు.వందేమాతరం 150 ఏళ్ల సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పాన్ని తెలియజేసేలా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కోఠిలోని వివేక వర్ధిని విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను కిషన్ రెడ్డి…

Read More

సిడబ్ల్యుసి సమావేశంలో సీఎం రేవంత్.

డిసెంబర్ 27 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి.

Read More