హైడర్షాకోట్ 123వ డివిజన్‌లో సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టిన మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి, టింకు రెడ్డి,

బండ్లగూడ తెలంగాణ కానుక ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని మాజీ కార్పొరేటర్ షాపురం శ్రీనాథ్ రెడ్డి అన్నారు. హైడర్షాకోట్ 123వ డివిజన్ పరిధిలో రహదారులు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను గుర్తించిన మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి టింకు రెడ్డి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు…

Read More

ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు కృతజ్ఞతలు,

హైడ్రా కమిషనర్ ను కలసి అభినందలు తెలిపిన స్థానికులు హైదరాబాద్, జూన్ 06: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ విలేజ్ లోని ముష్కిన్ చెరువును కాపాడిన హైడ్రాకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం హైడ్రా కార్యాలయానికి వచ్చి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలసి అభినందించారు. కబ్జాల పాలవుతున్న చెరువును కాపాడి సకల జీవకోటికి ప్రాణం పోశారంటూ పేర్కొన్నారు. చుట్టూ ఎత్తయిన అపార్ట్మెంట్లు.. మధ్యలో ఉన్న ఏకైక చెరువు కబ్జాల పాలవుతోందని తామంతా ఆందోళన…

Read More

ఘనంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలు,

తాండూర్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గురువారం వికారాబాద్ జిల్లాతో పాటు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.జనహృదయ నేత, రైతు జనబాంధవుడు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ని యాలాల మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ…

Read More

కోకాపేటలోని దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం ఎవ్వరికీ లీజ్ కు ఇవ్వలేదు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఐలయ్య కురుమ హైదరాబాద్, జూన్ 04: గత కొంత కాలంగా దుష్టశక్తులు, సంఘం వ్యతిరేక శక్తులు, అజ్ఞానులు కొంత మంది తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై బడా నేతలపై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా గురువారం కోకాపేటలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కురుమ విద్యార్థుల హాస్టల్ ట్రస్ట్ భవన్, దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవనం…

Read More

ఎన్డీఏ నేతల భేటీ

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ. రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాల పై నిర్వహించే కార్యక్రమాల కార్యాచరణ పై చర్చిస్తున్న నేతలు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ భేటీకి హాజరయ్యారు.

Read More

అమీర్‌పేట‌లో షాపింగ్ కాంప్లెక్స్‌కు మంట‌లుఫైర్ సిబ్బందితో క‌ల‌సి మంట‌ల‌నార్పిన హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు

హైద‌రాబాద్, జూన్ 04: అమీర్‌పేట‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో చెల‌రేగిన మంట‌ల‌ను ఫైర్ సిబ్బందితో క‌లిసి హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు అదుపులోకి తెచ్చాయి. ప‌క్క‌నే ఉన్న దుకాణాల‌కు, ఇత‌ర భ‌వ‌నాల‌కు మంట‌లు వ్యాపించ‌కుండా నియంత్రించాయి. అమీర్‌పేట నుంచి ఎస్ ఆర్ న‌గ‌ర్ వెళ్తున్న మార్గంలో మెట్రో పిల్ల‌ర్ నంబ‌రు 1043 స‌మీపంలో ఉన్న రెండంత‌స్తుల షాపింగ్ కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 12.30 గంట‌ల ప్రాంతంలో మంట‌లు చెల‌రేగాయి. హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు అంద‌గానే.. అదే సమాచారం క్షేత్ర‌స్థాయిలో…

Read More

రెడ్డి ఉమెన్స్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం,

హైదరాబాద్, జూన్ 04: తెలంగాణ కానుక రాజా బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. డాక్టర్ జె. అచ్యుతదేవి తెలిపారు. గురువారం నారాయణగూడ లోని కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… 73 ఏళ్లుగా మహిళా సాధికారతకు మారుపేరుగా నిలిచిన కళాశాల నాక్ 5వ సైకిల్లో ‘ఏ’ గ్రేడ్ సాధించి రాష్ట్రంలోనే మొదటి కళాశాలగా ఆర్ బీవిఆర్ఆర్ కళాశాల గుర్తింపు పొంందిందని తెలిపారు. లైఫ్…

Read More

ఘనంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వీడ్కోలు

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. సహచర ఐపీఎస్ అధికారులతో కలిసి డీజీపీకి సాదర వీడ్కోలు పలికారు. రాష్ట్ర పోలీసు శాఖ అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు శివధర్ రెడ్డి అందించిన సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వం పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పలువురు ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Read More

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడులు

రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఇంటి పన్ను విషయంలో బాధితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి బిల్ కలెక్టర్‌ను ట్రాప్ చేసిన ఏసీబీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని సూచన

Read More

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం: మంత్రి శ్రీధర్ బాబు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశించిన లక్ష్యాల మేరకు ముందుకు సాగాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఏటా 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గురువారం నాడు హిమాయత్ నగర్ లోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 శాసనసభ నియోజకవర్గాల…

Read More