ఘనంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలు,

Spread the love

తాండూర్ : తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గురువారం వికారాబాద్ జిల్లాతో పాటు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
జనహృదయ నేత, రైతు జనబాంధవుడు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు, రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ని యాలాల మండలానికి చెందిన కాంగ్రెస్ నేతలు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ స్పీకర్‌గా ఆయన ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ.. ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్బంగా పలువురు ఆకాంక్షించారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో యాలాల మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అయ్యా గాళ్ళ బీమయ్య, మాజీ అధ్యక్షులు
శంకరప్ప, పగిడి పల్లి
నర్సిములు,గంగా సాగర్ నర్సిములు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *