-వ్యవసాయ అధికారి కే.రాజు.
బయ్యారం,తెలంగాణ కానుక,జులై 9.
బయ్యారం మండలంలోని కొత్తపేట మీ సేవా కేంద్రంలో గురువారం కీప్యాడ్ మొబైల్ ఫోన్‌లు ఉపయోగిస్తున్న రైతులు,మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం లేని గ్రామాలకు చెందిన రైతులకు యూరియా బుకింగ్ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, కొంతమందికి రైతులకు మీ సేవా కేంద్రం ద్వారా యూరియా బుకింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా రైతులకు యూరియా బుకింగ్ విధానం, దాని ప్రయోజనాలు,నిర్ణీత సమయంలో ఎరువులను పొందేందుకు బుకింగ్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.స్మార్ట్‌ఫోన్,మొబైల్ నెట్‌వర్క్ సౌకర్యం లేని రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సమీపంలోని మీ సేవా కేంద్రాలను వినియోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి కే.రాజు సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైనప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలని కోరారు.
