ప్రజానాయకుడు ప్రకాష్ గౌడ్….

Spread the love

ఎంఎల్ఏ ని విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందా…!

సదాల వెంకట్ రెడ్డి పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకుపల్లి రణధీర్ రెడ్డి

రాజేంద్రనగర్ : తెలంగాణ కానుక

రాజేంద్రనగర్ నియోజకవర్గం సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను బిఆర్ఎస్ నాయకుడు విమర్శించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెరుకుపల్లి రణధీర్ రెడ్డి అన్నారు. గురువారం శివరాంపల్లి లోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ నాయకుడు సదాల వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను రాజీనామా చేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందని నీ స్థాయికి తగ్గ విషయాలు మాట్లాడితే మంచిదని, ఇంతకు నీకు బిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉందా
అని ప్రశ్నించారు. స్థాయి మరిచి మరోసారి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.
రాజకీయాల్లో నైతిక విలువలు లేని నీవు బిఆర్ఎస్ పార్టీలో ఉంటూనే గత అసెంబ్లీ ఎన్నికలలో మరో పార్టీకి పనిచేసిన విషయాన్ని మర్చిపోయావా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల మన్ననలు పొంది
నాలుగు సార్లు దిగ్విజయంగా ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజల మనిషి ప్రకాష్ గౌడ్ అని వెల్లడించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *