కోకాపేటలోని దొడ్డి కొమురయ్య ఆత్మగౌరవ భవనం ఎవ్వరికీ లీజ్ కు ఇవ్వలేదు

Spread the love

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఐలయ్య కురుమ

హైదరాబాద్, జూన్ 04: గత కొంత కాలంగా దుష్టశక్తులు, సంఘం వ్యతిరేక శక్తులు, అజ్ఞానులు కొంత మంది తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘంపై బడా నేతలపై సోషల్ మీడియాలో చేస్తున్న ఆరోపణలు, విమర్శలను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా గురువారం కోకాపేటలోని ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర కురుమ విద్యార్థుల హాస్టల్ ట్రస్ట్ భవన్, దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవనం ప్రాంగణంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కురుమ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొంత మంది చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అలాగే కురుమల ఆరాధ దైర్యం శ్రీ శ్రీ శ్రీ బీరప్ప స్వామి సాక్షిగా ఈ భవనం ఎవ్వరికీ ఎలాంటి లీజుకు ఇవ్వలేదని ఆయన వివరణ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలుపోందేందుకు రాష్ట్ర కురుమలు సహకరించారని, కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగానని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కాని తనపై సంఘం పెద్దలపై ఆరోపణలు, విమర్శలు చేయడం తగదని, ఇక నుంచి అవి మానుకుని సంఘానికి, కురుమలకు సేవలు అందించాలని ప్రభుత్వ విప్ ఐలయ్య సూచించారు. ఎంతో ఆసక్తికరంగా జలిగిన ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామ మల్లేశం కురుమ, కురుమ రాష్ట్ర నాయకులు కొలుపుల నరసింహ, జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కంకాల శ్యామ్ కురుమ, రాష్ట్ర బీసీ సంఘం నేత గొరిగే కృష్ణ కురుమ, షెపర్డ్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బూర్గడ్డ నగేష్ కురుమ, కోశికె శ్రీనివాస్ రావు కురుమ, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల సంఘం నేత డాక్టర్ కె.ఎలెందర్, మణికొండ కార్పొరేటర్ ముత్యాలు, చల్లాపూర్ కార్పొరేటర్ శ్రీశైలం, కార్పొరేటర్ కె పోచన్న, ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ బి. భాస్కర్, ఎన్. మల్లేష్, మణికొండ కురుమ సంఘం మండల అధ్యక్షులు డి భాస్కర్, కే. కుమార్, తదితర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *