బాపూ ఘాట్లో మహాత్మా గాంధీకి గవర్నర్ పుష్పాంజలి
హైదరాబాద్,తెలంగాణ కానుక
మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని బాపూ ఘాట్లో మహాత్మా గాంధీకి గవర్నర్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, కరుణ వంటి విలువలు నేటికీ యావత్ మానవాళికి స్ఫూర్తినిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. శాంతి, ఐక్యత, దేశభక్తి, సేవాభావంతో గాంధీజీ గొప్ప ఆశయాలను ఆచరణలో పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
