బోడుప్పల్ బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఓటర్ నమోదుకు ఏర్పాట్లు
బోడుప్పల్, అక్టోబర్ 8 తెలంగాణ కానుక :
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ 11, 12 డివిజన్ల మాజీ జడ్పిటిసి, బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు గురించి సమావేశం ఏర్పాటు చేశారు. 2021 సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పట్టభద్రులు ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతూ, రిజిస్ట్రేషన్ క్యాంపెయిన్ బి ఆర్ ఎస్ పార్టీ ఆఫీసులో ప్రారంభించారు. అర్హత గల పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బందారం శ్రీధర్ గౌడ్, ఉప్పరి విజయ్, సామాల మనోహర్ రెడ్డి, కీర్తన్ రెడ్డి, శ్రీకాంత్, మురళి, కృష్ణ, దినేష్ తదితరులు పాల్గొన్నారు.
