బతుకమ్మ వేళ గౌని చెరువుకు జలకళ బోరు ఏర్పాటు

Spread the love

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగవంతం

నార్సింగి, తెలంగాణ కానుక

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా, బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకొని నార్సింగి సర్కిల్ పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామంలోని గౌని చెరువులో నీటిని నింపేందుకు చర్యలు చేపట్టారు.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ సహకారంతో, సీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు గౌని చెరువులో నీరు లేనందున ప్రత్యేకంగా బోర్ వేయడం జరిగింది.

గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం ఈ బోర్ మోటార్ ప్రారంభించారు. బోర్ ద్వారా వచ్చే నీటితో గౌని చెరువును నింపి బతుకమ్మ వేడుకలకు సిద్ధం చేయనున్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టామని అన్నారు. వట్టినాగులపల్లి గౌని చెరువులో నీరు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలియగానే వెంటనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సహకారంతో, సీఎంసీ కమిషనర్ ఆదేశాలతో వెంటనే బోర్ మంజూరు చేయించామని తెలిపారు.

ప్రజా పాలనలో ప్రజల అవసరాలు, పండుగల ప్రాధాన్యతను గుర్తించి అధికారులు సత్వరమే స్పందిస్తున్నారని, ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బతుకమ్మ పండుగ నాటికి చెరువులో పుష్కలంగా నీరు నింపి, మహిళలు బతుకమ్మలు నిమజ్జనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దుల్చన్ శిష్పాల్ సింగ్ మాజీ ఎంపిటిసి గొల్ల నాగేష్ యాదవ్,మాజీ మున్సిపల్ చైర్మన్ రేఖ యాదగిరి గండిపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నె నరేందర్ ముదిరాజ్ మాజీ వార్డు సభ్యులు కుమ్మరి శేఖర్ బుడాల అరుణ్ ముదిరాజ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *