అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ :

Spread the love

గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్

నార్సింగి తెలంగాణ కానుక

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురువారం వట్టినాగులపల్లి లో ఘనంగా జరిగింది.
గ్రామపంచాయతీ దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ..

తెలంగాణ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. ఈ నూతన స్మార్ట్ కార్డుల ద్వారా పారదర్శకంగా రేషన్ పంపిణీ జరుగుతుందని, అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరతాయని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దుల్చన్ శశిపాల్ సింగ్,మాజీ ఎంపీటీసీ గొల్ల నాగేష్ యాదవ్,గండిపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మన్నే నరేందర్ ముదిరాజ్, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి శేఖర్, బుడాల అరుణ్ ముదిరాజ్, గోలియా తార సింగ్,కొండే కృష్ణ యాదవ్, మంగళవారం కృష్ణ యాదవ్,గొల్ల సుధాకర్ యాదవ్,మందుమూల లక్ష్మణ్ రెడ్డి, భూపతి శ్రీశైలం మంగళ యాదగిరి కొండే సాయికిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *