టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ ముజీబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆస్పత్రిలో అన్నదానం,

Spread the love

అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు ముజీబ్

హైదరాబాద్ తెలంగాణ కానుక

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీఎన్జీవో) కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం . హుస్సేనీ ముజీబ్ ఆధ్వర్యంలోని అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని ముజీబ్ అన్నారు.

ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్ లోని ఎం ఎన్ జె క్యాన్సర్ ఆస్పత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వెంట ఉన్న బంధువులు, సహాయకులకు భోజనాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవ చేయాలనే సంకల్పంతో ముజీబ్ అసద్ అన్వర్ మెమోరియల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి పేదలకు, రోగులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులు భోజనం కోసం ఇబ్బందులు పడుతుంటారని, వారిని ఆదుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ బాధితులు ఎంతో వేదన అనుభవిస్తారని, వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, అందుకే వారికి భోజన వసతి కల్పించడం చిన్న ప్రయత్నమని అన్నారు.

టీఎన్జీవో కేంద్ర సంఘం తరపున ఉద్యోగుల సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని డాక్టర్ ఎస్.ఎమ్. హుస్సేని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో స్కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సత్యనారాయణ, కస్తూరి వెంకట్,ఉపాధ్యక్షులు కొండల్ రెడ్డి,టీఎన్జీవోస్ హైదరాబాద్ సిటీ అధ్యక్షులు శ్రీకాంత్, హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కే.ఆర్ రాజ్ కుమార్, ఏపీఆర్ఓ మహమ్మద్ వహీద్, క్యాన్సర్ ఆస్పత్రి యూనియన్ అధ్యక్షుడు శివకుమార్, యూనియన్ కార్యదర్శి శేఖర్, డి శివ, రాజేష్ యాదవ్,హరీష్, చౌహన్,యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *