తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా సోను భాయ్ (రాకేష్ గైక్లాడ్) నియామకం!

Spread the love

గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ బలోపేతమే లక్ష్యం.. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగురవేస్తాం: రాకేష్ గైక్లాడ్

హైదరాబాద్, నవంబర్ 03(తెలంగాణ కానుక):

తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా రాకేష్ గైక్లాడ్ (సోనూ భాయ్) నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తన జన్మదినం సందర్భంగా పార్టీ కీలక బాధ్యతలు అప్పగించిన కల్వకుంట్ల కవితకు రాకేష్ గైక్లాడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ రక్షణ సేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పై తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఎగురవేయడమే తమ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. యువత రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలకు బీసీ అభ్యర్థులను ప్రకటించడం తెలంగాణ రక్షణ సేన పార్టీ సామాజిక న్యాయానికి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత, అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.తన జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆశీర్వాదాలు తీసుకోవడం, అదే రోజున గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా నియామక బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని రాకేష్ గైక్లాడ్ తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మౌనిక నరేష్, సయ్యద్ అబూబకర్ బిన్ జాఫర్ , సిర్పుల రవికాంత్, నంద్యాల అనిల్ కుమార్, తదితర కార్యకర్తలు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *