మణికొండ తెలంగాణ కానుక
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రావణ్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కృషి చేస్తామని తెలిపారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
