హైదర్ షాకోట్ 123 డివిజన్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లో చేరిన వినయ్ కుమార్

Spread the love

పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో చేరిక.. పాల్గొన్న రాజేంద్రనగర్ సర్కిల్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు

బండ్లగూడ తెలంగాణ కానుక

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ షాకోట్ 123 డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వినయ్ కుమార్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ సర్కిల్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసే నేడు యువత బీఆర్ఎస్ వైపు వస్తున్నారని అన్నారు. వినయ్ కుమార్ రాకతో హైదర్ షాకోట్ డివిజన్ లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నుండి వలసలు పెరుగుతున్నాయని, ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. వినయ్ కుమార్ లాంటి క్రియాశీలక నాయకులకు పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

రాజేంద్రనగర్ సర్కిల్ అధ్యక్షుడు రావులకోళ్ల నాగరాజు మాట్లాడుతూ.. హైదర్ షాకోట్ 123 డివిజన్ లో వినయ్ కుమార్ చేరికతో డివిజన్ లో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని తెలిపారు.

అనంతరం వినయ్ కుమార్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి నాయకత్వం పట్ల, కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడై బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హైదర్ షాకోట్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *