కిస్మత్ పూర్ లో నూతన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు చర్యలు.. ప్రాంతాల గుర్తింపు

Spread the love

నీరుడు పవన్ సాయి ముదిరాజ్ వినతిపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.. సంయుక్త పరిశీలన

బండ్లగూడ తెలంగాణ కానుక

కిస్మత్ పూర్ లో నూతన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. రెండు వారాల క్రితం స్థానిక బీజేపీ నాయకుడు నీరుడు పవన్ సాయి ముదిరాజ్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇంచార్జ్ ఏసీపీ, శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారికి వినతిపత్రం అందజేశారు.

కిస్మత్ పూర్ ప్రధాన రహదారి, అంతర్గత కాలనీ రోడ్లలో వాహనాలు అతివేగంగా వెళుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా స్కూళ్లు, జనావాసాల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన వినతిపత్రంలో పవన్ సాయి ముదిరాజ్ పేర్కొన్నారు.

ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, మంగళవారం ట్రాఫిక్ పోలీస్ బృందం పవన్ సాయి ముదిరాజ్ తో కలిసి కిస్మత్ పూర్ లోని సంబంధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల స్పీడ్ బ్రేకర్లకు అవసరమైన ప్రదేశాలను గుర్తించారు.

గుర్తించిన ప్రధాన ప్రాంతాలు:

  • కిస్మత్ పూర్ ప్రధాన చౌరస్తా సమీపంలో
  • పాఠశాలలు, కాలనీ ప్రవేశ ద్వారాల వద్ద
  • అతివేగంగా వాహనాలు వెళ్లే అంతర్గత రహదారుల్లో

త్వరలోనే ఉన్నతాధికారుల అనుమతితో శాస్త్రీయ పద్ధతిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపినట్లు పవన్ సాయి ముదిరాజ్ తెలిపారు. తన వినతికి వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ, శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని, ప్రజలకు భద్రత చేకూరుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *