నెక్నాంపూర్ వార్డ్ నెంబర్ 128 లో ప్రజా సమస్యల పరిశీలన

Spread the love

మణికొండ తెలంగాణ కానుక

నార్సింగి సర్కిల్ పరిధిలోని నెక్నాంపూర్ వార్డ్ నెంబర్ 128 లో వన్ డే వన్ వార్డ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటించింది. వార్డులోని ప్రధాన సమస్యలైన స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం, రోడ్లపై గుంతలు, ప్యాచ్ వర్క్ లు, కుక్కల బెడద, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను అధికారులు నేరుగా పరిశీలించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటిని తక్షణమే పరిష్కరించడమే వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు.

వార్డులో స్ట్రీట్ లైట్లు వెలగని చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని, రోడ్లపై ఏర్పడిన గుంతలకు ప్యాచ్ వర్క్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులకు సూచించారు.

ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని, వచ్చిన ఫిర్యాదులను అతి తక్కువ సమయంలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ శ్రీధర్, ఏఈ సంతోష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సంపత్, సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉపేంద్ర నాథ్ రెడ్డి ఉపాధ్యక్షుడు అంది లక్ష్మణరావు సభ్యులు దిలీప్ కక్కాడ ముత్తంగి లక్ష్మయ్య బుద్ధులు బాబు రాజు చారి సూర్యనారాయణ రామకృష్ణ శివరామకృష్ణ శ్రీకాంత్ విజయ్ కుమార్ కృష్ణ సీఎంసీ సిబ్బంది స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *