రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో తీవ్ర నీటి ఎద్దడి

Spread the love

బండ్లగూడ తెలంగాణ కానుక

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని రావుల కోళ్ల నాగరాజు అన్నారు.

ముఖ్యంగా హైదర్ షాకోట్ డివిజన్ లోని బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో నీటి సమస్య మరింత ఎక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులకోసారి మాత్రమే మంచినీటి సరఫరా అవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

వేసవి కాలం కాకపోయినా నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొన్నారు. పేద, బలహీన వర్గాల ప్రజలు డబ్బులు పెట్టి ట్యాంకర్లు తెప్పించుకోలేక అవస్థలు పడుతున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ రాజేంద్రనగర్ సర్కిల్ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు స్థానికులతో కలిసి జలమండలి మేనేజర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి రెండు రోజులకోసారి అయినా మంచినీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నీటి సమస్యను పరిష్కరించకపోతే స్థానికులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *