రెడ్డి ఉమెన్స్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం,

Spread the love

హైదరాబాద్, జూన్ 04: తెలంగాణ కానుక

రాజా బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. డాక్టర్ జె. అచ్యుతదేవి తెలిపారు. గురువారం నారాయణగూడ లోని కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… 73 ఏళ్లుగా మహిళా సాధికారతకు మారుపేరుగా నిలిచిన కళాశాల నాక్ 5వ సైకిల్లో ‘ఏ’ గ్రేడ్ సాధించి రాష్ట్రంలోనే మొదటి కళాశాలగా ఆర్ బీవిఆర్ఆర్ కళాశాల గుర్తింపు పొంందిందని తెలిపారు. లైఫ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఫిజికల్ సైన్సెస్ విభాగాలలో 18 అండర్ గ్రాడ్యుయేట్ (యుజి) కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కొత్తగా బీఎస్సీ ఇన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సును ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. కళాశాలలో వీ-హబ్, టి-హబ్, టీజీఏఐసీ లతో భాగస్వామ్యం కుదుర్చుకుని విద్యార్థులలో ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రొత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్లేస్మెంట్ సెల్ ద్వారా ప్లేస్మెంట్ డ్రైవ్ లు, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తూవిద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా గ్రాడ్యుయేట్లైన విద్యార్థినీలకు ఉన్నతమైన కేరీర్ అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థినీలు ఈ అవకాశాలను సద్వీనియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *