అమీర్‌పేట‌లో షాపింగ్ కాంప్లెక్స్‌కు మంట‌లుఫైర్ సిబ్బందితో క‌ల‌సి మంట‌ల‌నార్పిన హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు

Spread the love

హైద‌రాబాద్, జూన్ 04:

అమీర్‌పేట‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో చెల‌రేగిన మంట‌ల‌ను ఫైర్ సిబ్బందితో క‌లిసి హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు అదుపులోకి తెచ్చాయి. ప‌క్క‌నే ఉన్న దుకాణాల‌కు, ఇత‌ర భ‌వ‌నాల‌కు మంట‌లు వ్యాపించ‌కుండా నియంత్రించాయి. అమీర్‌పేట నుంచి ఎస్ ఆర్ న‌గ‌ర్ వెళ్తున్న మార్గంలో మెట్రో పిల్ల‌ర్ నంబ‌రు 1043 స‌మీపంలో ఉన్న రెండంత‌స్తుల షాపింగ్ కాంప్లెక్స్‌లో మధ్యాహ్నం 12.30 గంట‌ల ప్రాంతంలో మంట‌లు చెల‌రేగాయి. హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు అంద‌గానే.. అదే సమాచారం క్షేత్ర‌స్థాయిలో ఉన్న డీఆర్ ఎప్ బృందాల‌కు పంపారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని.. ఫైర్ సిబ్బందితో క‌లిసి మంట‌ల‌నార్పే ప‌నుల్లో డీఆర్ ఎఫ్ బృందాలు నిమ‌గ్న‌మ‌య్యాయి. వెనుక వైపు ఉన్న మెస్‌తో పాటు.. ప‌క్క‌నే ఉన్న దుకాణాల‌కు మంట‌లు వ్యాపించ‌కుండా ఫైర్ ఇంజిన్లు మంట‌లార్పాయి. హైడ్రా అద‌న‌పు సంచాల‌కులు శ్రీ వ‌ర్ల పాప‌య్య‌గారు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఆర్‌ ఎఫ్ వో శ్రీ జ‌య‌ప్ర‌కాష్‌తో పాటు ఎస్ ఎఫ్ వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, డీఆర్ ఎప్ స‌భ్యులు 20 మంది మంట‌ల‌ను ఆదుపు చేసిన వారిలో ఉన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *