హైడర్షాకోట్ 123వ డివిజన్‌లో సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టిన మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి, టింకు రెడ్డి,

Spread the love

బండ్లగూడ తెలంగాణ కానుక

ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని మాజీ కార్పొరేటర్ షాపురం శ్రీనాథ్ రెడ్డి అన్నారు. హైడర్షాకోట్ 123వ డివిజన్ పరిధిలో రహదారులు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యను గుర్తించిన మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి టింకు రెడ్డి ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తమ సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో
మాజీ ఎంపీటీసీ సంతోష్ కుమార్ మాజీ వార్డ్ సభ్యుడు రవికాంత్ రెడ్డి
సతీష్ యాదవ్ యాదగిరి లడ్డు తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *