కాంగ్రెస్ పార్టీలో కి సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన కేఎల్ఆర్

Spread the love

మహేశ్వరం తెలంగాణ కానుక

తుక్కుగూడ కార్యాలయంలో కిచ్చెన్నతో పలువురు భేటీ
పేద రోగులకు ఆపన్నహస్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ తుక్కుగూడ కార్యాలయంలో నేదునూరు సహా పలు గ్రామాల ప్రజలకు సీఎంర్ఫ్ చెక్కులను అందజేశారు.
నాగారం గ్రామానికి సీనియర్ జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కు మూడు రంగుల కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు కేఎల్ఆర్
బడంగ్ పేట, అల్మాస్ గూడ సహా పలు ప్రాంతాల్లోని కాలనీల సమస్యలు పరిష్కరించాలని సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కిచ్చెన్నగారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… కాలనీల్లో సమస్యల పరిష్కరం కోసం రూ.30కోట్లు ప్రభుత్వ నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా పలువురు నాయకులు, పలు సంఘాల నేతలు కేఎల్ఆర్ కలిశారు. వివిధ సమస్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో.. నాగారం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం మండల్ మాజీ అధ్యక్షులు కావలి దశరథ మరియు నందు పల్లి గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ వత్తుల నారాయణ. సీనియర్ జర్నలిస్ట్ వై యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *