సంగారెడ్డి తెలంగాణ కానుక
సంగారెడ్డి లోని ఐబి గెస్ట్ హౌస్ లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పుట్టినరోజు
వేడుకలు ఘనంగా జరిగాయి.సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు మనీష్ గౌడ్ నేతృత్వం లో
అభిమానుల మధ్య కేకును కట్ చేసి జగ్గా రెడ్డి కి జన్మదినం శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జగ్గారెడ్డి అభిమానులు, కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు హాజరైనారు.
