కాలేశ్వరం ప్రాజెక్టు పై కేంద్రం ప్రశంసలు.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకం మీద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే 2026 ప్రశంసలు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం వల్ల తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల (2014) నుండి 2.2 కోట్ల ఎకరాలకు (2023) పెరిగింది అని ఎకనామిక్ సర్వే 2026 రిపోర్టులో వెల్లడి. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించిన…

Read More

నిన్నటి నుండి ఇప్పటివరకు 80 లక్షల మంది దర్శనం.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మేడారంలో మీడియాతో మాట్లాడిన మంత్రి మాట్లాడుతూ, ఈరోజు దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని, సమ్మక్క గద్దెపైకి వచ్చే సమయానికి ఈ సంఖ్య కోటికి మించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణతో…

Read More

రైతుల కోసంమరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ.

మార్కెట్ లో మౌలిక వసతుల కల్పనకై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ అన్నారు. పాత మరుగుదొడ్లు పూర్తిగా ధ్వంసం అవడంతో రైతులు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని సోమవారం చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి మార్కెట్ లో రూ. 10 లక్షలతో నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో ఉన్న సమస్యల పరిష్కారానికి…

Read More

ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: జాతీయ జెండా ఆవిష్కరించినచైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్.

గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలన్నారు. ఐక్యత అభివృద్ధి ప్రేరణనిస్తూ జాతీయ జెండా పండుగను జరుపుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి…

Read More

సూర్య దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: నీలం మధు ముదిరాజ్..

సూర్య భగవంతుని ఆశీస్సులు తమపై ఉండాలని ప్రజలు రథసప్తమి రోజున భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం రథసప్తమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఫసల్వాది గ్రామ పరిధిలోని శ్రీ జ్యోతిష్వరస్తు విద్యాపీఠంలో బ్రహ్మశ్రీ డా,, శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాపనాశ రథసప్తమి వ్రతక్రతువు పూజా కార్యక్రమంలో నీలం పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు, ఈ సందర్భంగా నీలం…

Read More

కాంగ్రెస్ పతనం మొదలైందిరాబోయే ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలుపు ఖాయం సబితా.

కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గండిపేట మండలం 122 డివిజన్ కిస్మత్పురంలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించి పెద్ద సంఖ్యలో పార్టీ చేరారు. మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నేత, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎం. వాసవి నవీన్ ముదిరాజ్, నవీన్…

Read More

సోమశిల సౌందర్యం.. పర్యాటకానికి మణిహారం: మంత్రి జూపల్లి కృష్ణారావు.

నల్లమల అడవుల మధ్య కృష్ణమ్మ ఒడిలో ఒదిగి ఉన్న సోమశిల పర్యాటక కేంద్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన గమ్యస్థానమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఆయన సోమశిల ఎకో టూరిజం పార్కును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి కృష్ణా నది, ప్రకృతి అందాలను వీక్షించారు. ఈ సందర్భంగా సోమశిల తీరం నుంచి ఎకో పార్కు వరకు మంత్రి బోటులో విహరించారు. అక్కడి ప్రకృతి అందాలను, అటవీ, పర్యాటక శాఖ కల్పిస్తున్న…

Read More

బాధ్యతాయుత ఓటింగ్‌తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.

బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది థీమ్ “నా భారత్ – నా ఓటు” పౌరులే భారత ప్రజాస్వామ్యానికి కేంద్రబిందువని స్పష్టంగా తెలియజేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం స్థాపనను గుర్తుచేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి…

Read More

గన్నవరం విమానాశ్రయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ఘనస్వాగతం పలికిన టీడీపీ ప్రజాప్రతినిధులు.

విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకుని మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన యువత దావోస్ పర్యటన విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న లోకేష్ కు ఘనస్వాగతం పలికిన యువత రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన కోసం మంత్రి నారా లోకేష్ చేసిన కృషి పట్ల ప్లకార్డులు చేతబూని ధన్యవాదాలు తెలిపిన యువత ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.

Read More

ఘనంగా శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

విద్యారంగంలో శ్రీ గాయత్రీ ఇ-టెక్నోస్కూల్ అందిస్తోన్న సేవలు అభినందనీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. దశాబ్ద కాలంగా ఎంతోమంది విద్యార్థులను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అలాంటి వాళ్లే ప్రస్తుతం చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నారని అభినందించారు. ఇకపైనా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని, గాయత్రి స్కూల్లో చదివిన విద్యార్థులు సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చే ప్రముఖులుగా ఎదగాలని ఆకాంక్షించారు, శ్రీ గాయత్రి ఇ-టెక్నోస్కూల్ 14వ యానివర్సి వేడుకలు తారామతి బారాదరిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్…

Read More