సూర్య దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: నీలం మధు ముదిరాజ్..

Spread the love

సూర్య భగవంతుని ఆశీస్సులు తమపై ఉండాలని ప్రజలు రథసప్తమి రోజున భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
ఆదివారం రథసప్తమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ఫసల్వాది గ్రామ పరిధిలోని శ్రీ జ్యోతిష్వరస్తు విద్యాపీఠంలో బ్రహ్మశ్రీ డా,, శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పాపనాశ రథసప్తమి వ్రతక్రతువు పూజా కార్యక్రమంలో నీలం పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు, ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఆడపడుచులు ఇంత పెద్ద సంఖ్యలో హాజరై వ్రతంలో పాల్గొనడం సంతోషకరం అన్నారు, ఈ రథసప్తమి భక్తుల జీవితాలలోకి వెలుగులు తేవాలని, ప్రజల పాపాలు తొలిగిపోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *